నువ్వు ట్విట్టర్ లో రాసుకుందే చరిత్ర అనుకుంటే ఎలా శకుని మామా?: బుద్దా వెంకన్న
- విజయసాయిరెడ్డిపై విరుచుకుపడిన బుద్ధా
- వరుస ట్వీట్లతో విమర్శల జడివాన
- కాస్త ఇతర పేపర్లు కూడా చదువుతుండు శకుని మామా అంటూ హితవు
శకుని మామా, ఎవరి హయాంలో ఆర్టీసీ నాశనమైందో ఓ పుస్తకం తయారుచేసి పంపిస్తాను, తీరిగ్గా చదువుకుందువుగాని అంటూ వ్యాఖ్యానించారు. "అప్పుడప్పుడు కాస్త వేరే పేపర్లు కూడా చదువుతుండు శకుని మామా, మీ తుగ్లక్ పాలన ఎంత బాగుందో అర్థమవుతుంది. 90 శాతం వలంటీర్లు మన కార్యకర్తలే అని పబ్లిగ్గా మాట్లాడిన నువ్వా వారి ఘనకార్యాల గురించి మాట్లాడేది?" అంటూ విమర్శించారు.