కశ్మీర్ లో కర్ఫ్యూ ఎత్తేసి చూడండి ఏం జరుగుతుందో!: ఇమ్రాన్ ఖాన్ కవ్వింపులు
- ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ప్రసంగం
- భారత్ పై అక్కసు వెళ్లగక్కిన వైనం
- అణుయుద్ధం వస్తే రెండు దేశాలకే పరిమితం కాదని వ్యాఖ్యలు
యుద్ధం వస్తే నివారించడానికే ఐక్యరాజ్యసమితి ఉందని, ఇప్పుడా సంస్థ 120 కోట్ల మంది పక్షాన ఉంటుందా, న్యాయం వైపు ఉంటుందా? అంటూ పెద్దమనిషి తరహాలో ప్రశ్నించారు. కశ్మీర్ లో ప్రజలను జంతువుల్లా పరిగణించి, బంధించారని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదని నర్మగర్భంగా హెచ్చరించారు.