'ఆవిరి' నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • నిరాశ పరిచిన 'అదుగో' మూవీ 
  • విభిన్నమైన కథాంశంతో 'ఆవిరి'
  • ఈ నెల 28న టీజర్ రిలీజ్     
మొదటి నుంచి కూడా నటుడిగా .. దర్శక నిర్మాతగా రవిబాబు కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఇంతకుముందు 'అదుగో' అంటూ ఓ పందిపిల్లతో ప్రయోగం తరహా సినిమా చేసిన ఆయన, ఈ సారి మరోకొత్త కాన్సెప్ట్ తో 'ఆవిరి' అనే సినిమాను రూపొందించాడు.

కథా నేపథ్యం .. అందుకు సంబంధించిన విషయాలను సస్పెన్స్ లో ఉంచుతూ, ప్రెషర్ కుక్కర్ ద్వారా వచ్చే ఆవిరితో టైటిల్ నే హైలైట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన ఒక వీడియోను వదిలాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ఈ వీడియో ద్వారా ఆయన తెలియజేశాడు. 'దిల్' రాజు సమర్పిస్తోన్న ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు నేహా చౌహాన్ పరిచయమవుతోంది. 'అవును' తరువాత ఆ స్థాయి సక్సెస్ చూడని రవిబాబుకి, ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ చేస్తుందో చూడాలి.
Go Back to Shorts
RaviBabu
Neha Chouhan

More Telugu News