ప్రణయ్‌ని మర్చిపో ...లేదంటే...?: లేఖ ద్వారా అమృతకు బెదిరింపులు
- ఇంటి వద్ద లెటర్ వదిలి వెళ్లిన ఆగంతుకుడు
- అమృత అత్తమామల ఆవేదన
- పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచన
ఇక భర్త ప్రణయ్ హత్య నాటికి అమృత ఐదు నెలల గర్భవతి. ఆ తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బిడ్డను చూసుకుంటూ అత్తవారింట్లోనే అమృత ఉంటోంది. ఇటువంటి సమయంలో బెదిరింపులపై అమృత అత్తమామలు ఆందోళన వ్యక్తం చేశారు. మా కోడలిని మానసికంగా హింసించేందుకే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేస్తున్నారని వాపోయారు. దీనిపై ప్రణయ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.