'జాన్' స్క్రిప్ట్ పై కసరత్తు అవసరమన్న ప్రభాస్?

24-09-2019 Tue 15:37 | Entertainment
  • ప్రభాస్ ను నిరాశ పరిచిన 'సాహో'
  • తదుపరి చిత్రంగా 'జాన్'
  • మార్పులు సూచించిన ప్రభాస్ 
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 'బాహుబలి'తో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ కారణంగా 'సాహో' భారీ వసూళ్లు రాబట్టింది. కానీ నిజానికి ఈ సినిమా ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా కథా కథనాల విషయంలోను .. లుక్ విషయంలోను ప్రభాస్ శ్రద్ధ పెట్టలేదని చాలామంది చెప్పుకున్నారు.

ఈ విషయాన్ని గ్రహించిన ప్రభాస్, తదుపరి ప్రాజెక్టు అయిన 'జాన్' విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఇంతకుముందే 'జాన్' ఓ 20 రోజుల పాటు షూటింగును జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ పై మరికొంత కసరత్తు జరగాలని దర్శకుడు రాధాకృష్ణతో ప్రభాస్ చెప్పాడట. కథలో కొన్ని మార్పులను సూచించి, ఆ మార్పులు చేసిన తరువాతనే షూటింగ్ మొదలుపెడదామని అన్నాడట. ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ అదే పనిలో వున్నాడని అంటున్నారు.
Prabhas

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more