వైసీపీ సర్కార్ కు మరో షాక్.. పీపీఏలపై పున:సమీక్ష జీవో 63ని కొట్టేసిన హైకోర్టు
- కుదించిన టారిఫ్ ప్రకారం తాత్కాలిక చెల్లింపులు చేయాలి
- పీపీఏల టారిఫ్ వ్యవహారాన్ని 6 నెలల్లోగా ఈఆర్సీ పరిష్కరించాలి
- ఏపీ హైకోర్టు ఆదేశాలు
పీపీఏల టారిఫ్ వ్యవహారాన్ని ఆరు నెలల్లోగా ఈఆర్సీ పరిష్కరించాలని ఆదేశించింది. ఇప్పటివరకూ నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, వివిధ కారణాలతో విద్యుత్ ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపు కింద యూనిట్ కు రూ.2.43 నుంచి రూ.2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను న్యాయస్థానం అంగీకరించింది.