బెంగళూరు టి20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి... సిరీస్ సమం చేసిన దక్షిణాఫ్రికా

22-09-2019 Sun 22:16 | Sports
  • మూడో టి20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విక్టరీ
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • ఒక్క వికెట్ నష్టానికి లక్ష్యం ఛేదించిన దక్షిణాఫ్రికా
బెంగళూరులో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భారత జట్టు పరాజయం పాలైంది. అన్నిరంగాల్లో సత్తా చాటిన దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులతో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్టుయిన్ 2, హెండ్రిక్స్ 2 వికెట్లు తీశారు.

అనంతరం 135 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ డికాక్ ముందుండి నడిపించాడు. డికాక్ 52 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (28), టెంబా బవుమా (27 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. దాంతో 16.5 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 140 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య మాత్రమే వికెట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.
T20IndiaSouth Africa

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more