'బాత్రూంలో బాబాయికి గుండెపోటు' ఈవెంట్ ను బాగా రక్తి కట్టించారు శకుని మామా!: బుద్ధా వెంకన్న
- వైసీపీ శవ రాజకీయాలను చూసి ఎన్నో సార్లు జనాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు
- మహామేత శవం దొరక్కముందే దొంగబ్బాయిని సీఎం చేయాలనుకున్నారు
- సంతకాల సేకరణ, ఓదార్పు యాత్ర బెస్ట్ ఈవెంట్స్ గా నిలిచాయి కదా?
ఇటీవల మీరు చేసిన 'బాత్రూంలో బాబాయికి గుండెపోటు' ఈవెంటును కూడా బాగా రక్తి కట్టించారని... వైసీపీ శవ రాజకీయాలను చూసి ఇప్పటికే అనేక సార్లు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు శకుని మామా అంటూ ఎద్దేవా చేశారు. 'బెస్ట్ డెడ్ బాడీ ఈవెంట్ మేనేజర్లుగా మీ దొంగబ్బాయి జగన్ కి, మీకు అవార్డులు వచ్చిన సంగతి మర్చిపోయారా శకుని మామా?' అని వ్యాఖ్యానించారు. మహామేత శవం దొరక్కముందే దొంగబ్బాయిని సీఎం చేయాలని మీ ఆధ్వర్యంలో జరిగిన సంతకాల సేకరణ, ఓదార్పు యాత్ర బెస్ట్ ఈవెంట్స్ గా నిలిచాయి కదా? అని అన్నారు.