సంచలన వీడియోను బయటపెట్టిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహన్రావు కోడలు సింధుశర్మ
- ఏప్రిల్ 20న సింధుశర్మపై భర్త, అత్తమామల దాడి
- చెంపలు వాయించి, చేతులు విరిచేసిన రిటైర్డ్ జడ్జి
- తీవ్రంగా కొట్టి, దుస్తులు చించేసిన వైనం
పెళ్లయిన దగ్గరి నుంచి అత్తమామలు తనను వేధిస్తున్నారని సింధు ఆరోపించారు. ఆ రోజు ముగ్గురూ కలిసి తనను తీవ్రంగా కొట్టారని, దుస్తులు చించేశారని అన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరితే పిచ్చాసుపత్రికి తరలిస్తామని హెచ్చరించారని అన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్తూ కూడా ఇంటి ఆవరణలో తనపై మరోమారు దాడి జరిగిందన్నారు. ఈ ఘటనపై అప్పట్లో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. తన భర్త వస్తాడని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. రామ్మోహన్రావు తన పలుకుబడిని ఉపయోగించి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తను విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.