ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి రూ. లక్ష బోనస్.. దసరా కానుక ప్రకటించిన కేసీఆర్
- సింగరేణి లాభాల్లో 28 శాతాన్ని కార్మికులకు బోనస్ గా ప్రకటించిన సీఎం
- ప్రతి కార్మికుడికి బోనస్ గా రూ. 1,00,899
- 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,565 కోట్ల లాభాన్ని ఆర్జించిన సింగరేణి
అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా సింగరేణి లాభాలు పెరుగుతున్నాయని చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,565 కోట్ల లాభాన్ని ఆర్జించిందని తెలిపారు. ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు, లాభాలు, టర్నోవర్ లో సింగరేణి ప్రగతిపథంలో దూసుకుపోతోందని... సింగరేణి ప్రగతి రాష్ట్ర ప్రభుత్వ దక్షతకు ప్రతీకగా నిలుస్తోందని కొనియాడారు.