హిందీలో 150 కోట్ల క్లబ్ లోకి చేరిన 'సాహో'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీలో 150 కోట్ల క్లబ్ లోకి చేరిన 'సాహో'

  • క్రితం నెల 30న వచ్చిన 'సాహో'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • హిందీలో తగ్గని వసూళ్ల జోరు  
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' .. క్రితం నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ తొలిరోజునే వచ్చినప్పటికీ, వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగులో కంటే హిందీలో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకెళుతోంది.

హిందీలో ఈ సినిమా 3వ వారం పూర్తయ్యేనాటికి 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. రివ్యూలతో సంబంధం లేకుండా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం సల్మాన్ సినిమాల విషయంలో జరుగుతూ ఉంటుంది. అలాంటి మేజిక్ ప్రభాస్ విషయంలో జరగడం గురించి ఇప్పుడు అంతా ఆశ్చర్యకరంగా చెప్పుకుంటున్నారు. 3వ వారాంతానికి హిందీ వెర్షన్ 153 కోట్లు (నెట్) సాధించినట్టు, ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Prabhas
Shraddha Kapoor

More Telugu News