మీకు, కోడెలకు మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టాలి: చంద్రబాబుకు కొడాలి నాని డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీకు, కోడెలకు మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టాలి: చంద్రబాబుకు కొడాలి నాని డిమాండ్

  • కోడెల మృతికి పూర్తిగా కారణం చంద్రబాబే
  • ఆ క్యాంపునకు కోడెల ఎందుకు రాలేదు?
  • కోడెల వస్తానంటే చంద్రబాబు వద్దన్నారా?
చంద్రబాబునాయుడుకి, కోడెల శివప్రసాద్ కు మధ్య ఉన్న విభేదాలు చెప్పాలని ఏపీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల మృతికి పూర్తిగా కారణం చంద్రబాబే అని ఆరోపించారు. ‘పల్నాడులో వైసీపీ బాధితులు’ అంటూ ఇటీవల తొమ్మిదిరోజులు క్యాంపులు నిర్వహించారు, ఈ క్యాంపునకు కోడెల ఎందుకు రాలేదు? కోడెల వస్తానంటే చంద్రబాబు వద్దన్నారా? చంద్రబాబే ఆయన్ని రావద్దని చెప్పారా? లేకపోతే చంద్రబాబు రమ్మంటే రానని కోడెల చెప్పారా? వీళ్లిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఏంటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పల్నాడులో వైసీపీ బాధితులు’ శిబిరంలో కోడెలను ఎందుకు ఇన్ వాల్వ్ కానివ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు.
Chandrababu
kodela siva prasad
Kodali Nani

More Telugu News