పాక్ వదిలిన మోర్టార్ ను నిర్వీర్యం చేస్తూ... త్రుటిలో తప్పించుకున్న భారత సైనికులు.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ వదిలిన మోర్టార్ ను నిర్వీర్యం చేస్తూ... త్రుటిలో తప్పించుకున్న భారత సైనికులు.. వీడియో ఇదిగో!

  • పేలకుండా ఉండిపోయిన 120 ఎంఎం మోర్టార్ షెల్
  • గుర్తించి సైన్యానికి సమాచారం ఇచ్చిన స్థానికులు
  • నిర్వీర్యం చేసిన ఇద్దరు జవాన్లు
పూంఛ్ సెక్టర్ లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, పాకిస్థాన్ ప్రయోగించిన ఓ 120 ఎంఎం మోర్టార్ షెల్ ను నిర్వీర్యం చేస్తూ, త్రుటిలో తప్పించుకున్న భారత సైనికుల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వాస్తవాధీన రేఖకు సమీపంలోని ఓ గ్రామంపై జరిపిన దాడిలో ఈ మోర్టార్ పేలకుండా ఉండిపోగా, దాన్ని జవాన్లు పేల్చారు. బాలాకోట్ లోని మెధార్ ప్రాంతంలో ఈ మోర్టార్ పడిపోయింది.

శనివారం నాడు కొంతమంది గ్రామస్థులు దీన్ని చూసి, సైన్యానికి సమాచారాన్ని అందించారు. ఆపై రంగంలోకి దిగిన ఆర్మీ నిపుణులు, దాన్ని నాశనం చేశారు. ఇక ఈ వీడియోలో మోర్టార్ చుట్టూ ఇసుక బస్తాలను పేర్చిన ఇద్దరు సైనికులు, దాన్ని వెలిగించి, అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే అది భారీ శబ్దం చేస్తూ పేలింది. బాలాకోట్ తో పాటు పలు ప్రాంతాల్లో పాక్ సైనికులు నిత్యమూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. వాటిని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు.
India
Pakistan
Mortor Shell
Detonating

More Telugu News