ఏపీ మహిళా కమిషన్ నుంచి త్వరలో హెల్ప్ లైన్ ప్రారంభిస్తాం: వాసిరెడ్డి పద్మ

  • ‘సామాజిక మాధ్యమాలు-మహిళల భద్రత’పై సదస్సు
  • ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం
  • మహిళల భద్రతపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తాం
ఏపీ మహిళా కమిషన్ నుంచి త్వరలో ‘హెల్ప్ లైన్’ ను ప్రారంభిస్తామని చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ‘సామాజిక మాధ్యమాలు-మహిళల భద్రత’ అనే అంశంపై రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. మహిళల భద్రతపై అన్ని కళాశాలల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.
Go Back to Shorts
Mahila commission
vasi reddy
padma
chairperson

More Telugu News