వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం సృష్టించిన షూటర్ ఇతడే!
- వైట్‌హౌస్ డిన్నర్‌లో ఆగంతకుడి కాల్పులు
- నిందితుడి ఫొటో, వీడియోను విడుదల చేసిన ట్రంప్
- అతడో మానసిక రోగి అన్న అమెరికా అధ్యక్షుడు
- సీక్రెట్ సర్వీస్ అధికారుల ధైర్యసాహసాలను కొనియాడిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమం వద్ద జరిగిన కాల్పుల ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న నిందితుడి ఫోటోను, వీడియోను స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' లో విడుదల చేశారు. "ఇతడే ఆ మానసిక రోగి" అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
శనివారం రాత్రి వాషింగ్టన్‌లోని హిల్‌టన్ హోటల్‌లో వందలాది మంది జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతో వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ అట్టహాసంగా మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ వేదికపై ప్రసంగించడానికి సిద్ధమవుతున్న సమయంలో, హోటల్ వెలుపల భద్రతా చెక్‌పాయింట్ వద్ద ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియాను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.
నిందితుడి వివరాలు, దాడి తీరు..
సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ ధరించి, అత్యాధునిక ఆయుధాలతో భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారికి ఛాతీపై బుల్లెట్ తగిలింది. అయితే, అతను బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అధికారులు తెలిపారు.
దాడికి పాల్పడిన వ్యక్తిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన కోల్ థామస్ అలెన్ (31)గా గుర్తించారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ విడుదల చేసిన చిత్రాల్లో, నిందితుడు నేలపై పడి ఉండగా, భద్రతా సిబ్బంది అతడిని చుట్టుముట్టి ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉగ్రవాద కోణం ఉందా లేక వ్యక్తిగత కారణాలున్నాయా అనే దిశగా ఎఫ్‌బీఐ, సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
భయంతో వణికిన అతిథులు
తుపాకీ శబ్దాలతో విందు ప్రాంగణం ఒక్కసారిగా భయానకంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక జర్నలిస్టులు, అతిథులు భయంతో టేబుళ్ల కింద, కుర్చీల వెనుక దాక్కున్నారు. కొద్దిసేపటికే టాక్టికల్ బృందాలు హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, అతిథులందరినీ సురక్షితంగా బయటకు పంపించాయి.
ఘటన అనంతరం వైట్‌హౌస్‌లో మాట్లాడిన ట్రంప్ తనను, దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన సీక్రెట్ సర్వీస్ అధికారుల ధైర్యసాహసాలను కొనియాడారు. "ఆ అధికారి ఒక హీరో. నేను అతనితో మాట్లాడాను, అతడు క్షేమంగా ఉన్నాడు. మన దేశంలో ఇలాంటి హింసకు తావులేదు. ఇది ఒక మానసిక రోగి చేసిన పిచ్చిపని" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రద్దయిన ఈ డిన్నర్‌ను వచ్చే 30 రోజుల్లో మరింత ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.