ఏంటీ తొక్కలో గేమ్‌లు?.. 'బిగ్‌బాస్'పై పునర్నవి ఫైర్!
- సెన్స్ ఉన్న టాస్క్‌లు ఇవ్వండి
- ముష్టి టాస్క్‌లు పెట్టి.. ఆ తర్వాత రద్దు చేయొద్దు
- రేపు చెడ్డీలు ఉతకాలా?: మహేశ్ విట్టా
కాగా, దెయ్యం టాస్క్‌లో చెత్త పెర్ఫార్మెన్స్‌కు గాను పునర్నవికి బిగ్‌బాస్ షూ పాలిష్ శిక్ష విధించాడు. దీనిపైనా పునర్నవి మండిపడింది. షూ పాలిష్ చేసేది లేదని, కావాలంటే బయటకు పంపేయొచ్చని బిగ్‌బాస్‌కు చెప్పింది. తానిక్కడికి వచ్చింది షూ పాలిష్ చేయడానికి కాదని కుండబద్దలుగొట్టింది. శిక్ష విధించే ముందు తానేం తప్పు చేశానో చెప్పాలని ప్రశ్నించింది.
మరోవైపు, మహేశ్ విట్టా కూడా బిగ్‌బాస్‌పై ఫైరయ్యాడు. ‘చెప్పులు తుడవాలా? చెడ్డీలేం ఉతకొద్దా?’ అని ప్రశ్నించాడు. చెప్పులు కడిగేంత చీప్‌గా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించాడు. పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? అని విరుచుకుపడ్డాడు. చెప్పులు తుడవడం ఏం టాస్కని, రేపు మీరు విప్పేసిన చెడ్డీలు కూడా ఉతకమంటారా? అని మహేశ్ విట్టా నిలదీశాడు.