బీమా సొమ్ము కోసం తనను తానే హత్య చేయించుకున్న వ్యక్తి!

  • అప్పులు తీర్చే మార్గం కానరాక తన హత్యకు తానే ప్లాన్
  • రూ.50 లక్షల బీమా చేయించుకున్న బాధితుడు
  • నిందితుల అరెస్ట్‌తో అసలు విషయం వెలుగులోకి
అప్పులు తీర్చేందుకు ఓ వ్యక్తి తన హత్యకు తానే ప్లాన్ చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని భిల్వారాలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన బల్వీర్ అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు చేశాడు. అయితే, రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం, తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో రూ. 50 లక్షలకు బీమా చేయించుకున్నాడు. ఇందులో భాగంగా రూ.8,43,200 ప్రీమియం చెల్లించాడు.

తాను చేసిన అప్పుల వల్ల తన కుటుంబం ఇబ్బందుల పాలవకూడదని బల్వీర్ నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే తన బీమా సొమ్ము కుటుంబ సభ్యులకు వస్తుందని, ఆ సొమ్ముతో వారు సంతోషంగా ఉంటారని భావించాడు. ఇందుకోసం తాను హత్యకు గురవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్ యాదవ్‌ను కలిసి తనను హత్య చేయాలంటూ బేరం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా రూ.80 వేలు చెల్లించాడు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రజ్వీర్ అనే వ్యక్తితో కలిసి బల్వీర్‌ను సునీల్ గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం తెలిసి విస్తుపోయారు.
Go Back to Shorts
Rajasthan
Uttar Pradesh
murder
Crime News

More Telugu News