ప్రభాస్ ను లైన్లో పెట్టే ప్రయత్నంలో పూరి?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ ను లైన్లో పెట్టే ప్రయత్నంలో పూరి?

  • 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ కొట్టిన పూరి 
  • తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో 
  • ప్రభాస్ కి కథ వినిపించిన పూరి?
ప్రభాస్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సాహో' 400 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రభాస్ తన తదుపరి సినిమా అయిన 'జాన్'పై దృష్టిపెట్టాడు. త్వరలో ఈ సినిమా తాజా షెడ్యూల్లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ను లైన్లో పెట్టే పనిలో పూరి ఉన్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్ కొట్టిన పూరి, తదుపరి సినిమాను విజయ్ దేవరకొండతో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ కి కూడా ఒక కథ వినిపించినట్టుగా సమాచారం. గతంలో మహేశ్ బాబుతో చేయాలనుకున్న 'జనగణమన' కథనే ఇది అని చెప్పుకుంటున్నారు. 'కథ బాగుంది' అని ప్రభాస్ చెప్పిన దగ్గర నుంచి పూరి ఆయనకి టచ్ లో ఉంటున్నాడని అంటున్నారు. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి మరి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'బుజ్జిగాడు .. మేడ్ ఇన్ చెన్నై' వచ్చిన సంగతి తెలిసిందే.
Prabhas
Puri

More Telugu News