రష్యాలో మోదీ నిరాడంబరత.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు!
- వ్లోడివోస్టోక్ నగరంలో ప్రత్యేక కార్యక్రమం
- మోదీ కోసం సోఫా ఏర్పాటుచేసిన అధికారులు
- అందరితో పాటు కుర్చీలోనే కూర్చుంటానన్న మోదీ
ఈ సందర్భంగా మోదీ కూర్చోవడానికి ప్రత్యేకంగా ఓ సోఫా, మిగతావారికి కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే దీన్ని గమనించిన మోదీ, తనకు ప్రత్యేకంగా సోఫా వద్దని సున్నితంగా తిరస్కరించారు. అందరి తరహాలోనే తనకూ కుర్చీ వేయాలని కోరారు. దీంతో ప్రధాని విజ్ఞప్తి మేరకు రష్యా అధికారులు మోదీకి కుర్చీని ఏర్పాటుచేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా, ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు, నిరాడంబరతపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.