నారా లోకేశ్ కు నర్సీపట్నం పోలీసుల షాక్.. బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరణ!
- హెల్మెట్లు ధరించాలని టీడీపీ శ్రేణులకు సూచన
- నిరసనగా కాలినడకన బయలుదేరిన లోకేశ్
- వాహనాలు నడుపుకుంటూ వెంట నడిచిన టీడీపీ శ్రేణులు
అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. టూవీలర్ ర్యాలీ చేపట్టాలంటే అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా నారా లోకేశ్ కాలినడకన ఎన్టీఆర్ ఆసుపత్రి వద్దకు బయలుదేరగా, టీడీపీ శ్రేణులు వాహనాలను నడిపించుకుంటూ ఆయన వెంట నడుస్తున్నారు.