Jagan: జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అరెస్ట్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, చిత్తూరు జిల్లా కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్దన్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 26న తలకోనలో ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై జనార్దన్ అనుచిత వ్యాఖ్యాలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో, ఆయనను సీఐ సురేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు. మరోవైపు, అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
Go Back to Shorts
Jagan
Vijayasai Reddy
Karvetinagaram
Chittoor District
Telugudesam
Arrest

More Telugu News