నడిరోడ్డుపై వింతగా ప్రవర్తించి స్థానికులతో తన్నులు తిన్న కన్నడ సినీ నటుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నడిరోడ్డుపై వింతగా ప్రవర్తించి స్థానికులతో తన్నులు తిన్న కన్నడ సినీ నటుడు

  • హోటల్ కు వెళ్లిన సినీ నటుడు హుచ్చా వెంకట్
  • చూసేందుకు ఎగబడిన జనాలు
  • తీవ్ర ఆగ్రహంతో రోడ్డుపైకి వచ్చి కారును ధ్వంసం చేసిన వెంకట్
  • చితకబాదిన స్థానికులు
కన్నడ చిత్ర పరిశ్రమలో హుచ్చా వెంకట్ అంటే ఎంతో గుర్తింపు ఉన్న నటుడు, దర్శకుడు, నిర్మాత. 2005లో వచ్చిన 'మెంటల్ మాంజా' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. పలు చిత్రాల్లో నటించడమే కాదు, దర్శకత్వం కూడా వహించాడు. కొన్ని చిత్రాలకు నిర్మాత కూడా. కన్నడ బిగ్ బాస్-3లోనూ పాల్గొన్నాడు. అయితే, తాజాగా తన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

గతంలో అనేక వివాదాలతో బ్యాడ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హుచ్చా వెంకట్ మరోసారి అదే రీతిలో హంగామా చేయడమే కాదు, ఈసారి స్థానికుల చేతిలో తన్నులు కూడా తిన్నాడు. కర్ణాటకలోని కొడగులో హుచ్చా వెంకట్ ఓ హోటల్ కు వెళ్లాడు. అయితే సినీ నటుడు కావడంతో వెంకట్ ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ సెలబ్రిటీ హోటల్ బయటికి వచ్చి ఓ కారును ధ్వంసం చేశాడు. ఇష్టంవచ్చినట్టు రంకెలేస్తూ, వింతగా ప్రవర్తిస్తుండడంతో స్థానికులు చితకబాదారు. అయినప్పటికీ హుచ్చా వెంకట్ విచిత్రంగా ప్రవర్తిస్తూ మీడియా కెమెరాల కంట్లో పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సినీ నటుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Hucha Venkat
Karnataka

More Telugu News