తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ సింధు

  • ఇటీవల  ప్రపంచ చాంపియన్‌షిప్ గెల్చుకున్న సింధు
  • తల్లిదండ్రులతో కలిసి స్వామి వారి అభిషేక సేవ
  • స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తల్లిదండ్రులతో కలిసి తిరుమల చేరుకున్న సింధు స్వామివారి అభిషేక సేవలో పాల్గొంది. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. అలాగే, సింధుతోపాటు పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తదితరులు కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Go Back to Shorts
PV Sindhu
Tirumala
lord venkateshwara
Tirupati

More Telugu News