విజయవంతంగా క్షిపణి పరీక్షను నిర్వహించిన పాకిస్థాన్.. వీడియో చూడండి
- 290 కి.మీ. పరిధి గల ఘజ్నవీ ప్రయోగం విజయవంతం
- వివిధ రకాల వార్ హెడ్లను మోసుకుపోగల సామర్థ్యం దీని సొంతం
- బలూచిస్థాన్ లోని టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి ప్రయోగం
మరోవైపు, కరాచీ ఎయిర్ స్పేస్ లోని మూడు రూట్లను ఈనెల 31 వరకు మూసి వేస్తున్నట్టు పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిన్న ప్రకటించింది. దీంతో, బలూచిస్థాన్ లోని టెస్ట్ రేంజ్ నుంచి పాకిస్థాన్ క్షిపణి పరీక్షను నిర్వహించబోతోందనే వార్తలు వెనువెంటనే వెలువడ్డాయి. మరోవైపు, జమ్మూకశ్మీర్ అంశంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించడంతో... ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.