అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మెండిస్ గుడ్‌బై
- 2015లో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం
- టీ20ల్లో రెండుసార్లు ఆరు వికెట్లు సాధించిన ఒకే ఒక్కడు
- నిరాశతో క్రికెట్‌కు గుడ్‌బై
మెండిస్ ఏడేళ్ల క్రికెట్ కెరియర్‌లో 19 టెస్టులు, 87 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 70, వన్డే, టీ20ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రంలోనే 8 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన మెండిస్.. టీ20 క్రికెట్‌లో రెండుసార్లు ఆరు వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వికెట్ల వేటలో వెనకబడడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ నాలుగేళ్లు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో నిరాశతో అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు.