ఈడీ కేసులో సుప్రీంకోర్టులో చిదంబరంకు తాత్కాలికంగా ఊరట!

  • ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ
  • కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ ప్రణాళిక
  • ఈడీ అరెస్ట్ నుంచి చిదంబరంకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీం ఆదేశాలు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు ఊరట కలిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చిదంబరంను అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ మంజూరు చేసింది. ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ చిదంబరంను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో, ఈడీ కూడా ఈ కాంగ్రెస్ సీనియర్ నేతను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా దర్యాప్తులో వేగం పెంచాలని భావిస్తోంది. అయితే, దీనిపై చిదంబరం పిటిషన్ దాఖలు చేయగా, విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Chidambaram
Supreme Court
INX
CBI
ED

More Telugu News