ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే పరిస్థితి కనిపించడంలేదు... ఇది స్పష్టం: జీవీఎల్
- ఏపీ రాజధాని అమరావతిపై అనిశ్చితి
- బొత్స వ్యాఖ్యలతో మొదలైన దుమారం
- స్పందించిన బీజేపీ నేత జీవీఎల్
ఏపీ మంత్రులు కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తుండడంతో అనిశ్చితి మరింత పెరుగుతోంది తప్ప, అది రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ మంత్రులపై ఒత్తిళ్లు వస్తుండొచ్చేమోనని వ్యాఖ్యానించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాట ఆడకుండా తన విధానం ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.