మూడేళ్లలో జియో నంబర్‌ వన్‌.. 33.13 కోట్ల యూజర్లతో సంచలనం

  • ఎయిర్‌టెల్‌, వొడా ఫోన్‌ను వెనక్కినెట్టి మొదటి స్థానం
  • ఆదాయంలోనూ గణనీయమైన ప్రగతి
  • జూన్‌ నాటికి టెలికం సేవల ద్వారా రూ.10,900 కోట్లు
ప్రారంభంలోనే సంచలనానికి తెరలేపిన రిలయన్స్‌ జియో మూడేళ్లలో తన అప్రతిహత ప్రస్థానంతో మొదటి స్థానానికి చేరుకుంది. దాదాపు 24 ఏళ్ల క్రితం టెలికం రంగంలోకి ప్రవేశించిన భారతి ఎయిర్‌ టెల్‌ను, మరో దిగ్గజం వొడాఫోన్‌ సంస్థను అతి తక్కువ కాలంలో వెనక్కినెట్టి సంచలనాన్ని నమోదు చేసింది.  మొత్తం 33 కోట్ల 13 లక్షల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంస్థ జూన్‌ నాటికి 10,900 కోట్ల రూపాయలు ఆర్జించి ఆదాయంలోనూ తిరుగులేదని నిరూపించింది.  ఇదే కాలానికి ఎయిర్‌టెల్‌ 10,701.5 కోట్లు, వొడాఫోన్‌`ఐడియా 9,808.92 కోట్లతో తర్వాత స్థానాలకు పడిపోయాయి.
Go Back to Shorts
Reliance-JIO
three years
number 1

More Telugu News