'సాహో' సెన్సార్ కాపీ చూసి అధికారుల ఫిదా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' సెన్సార్ కాపీ చూసి అధికారుల ఫిదా!

  • 30న విడుదల కానున్న 'సాహో'
  • యూ/ఏ సర్టిఫికెట్ సినిమా పొందిన చిత్రం
  • ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా సినిమా ఉందంటున్న అధికారులు
ఈనెల 30న విడుదల కానున్న 'సాహో' చిత్రం సెన్సారింగ్ లో యూ/ఏ సర్టిఫికెట్ ను పొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం సెన్సార్ కాపీని చూసి సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు అధికారులు, సినిమా అద్భుతమని కితాబిస్తున్నారు. తొలి సగంలో లవ్ స్టోరీ, ఆపై రెండో భాగంలో హాలీవుడ్ ను తలపించే ఫైట్స్ ఉన్నాయని, ఇవి ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంటాయని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

కాగా, థియేటర్ల వద్ద ఇప్పటి నుంచే ఫ్యాన్స్ సందడి ప్రారంభమైంది. సినిమా విడుదలకు ఇంకా మూడు రోజుల గడువు ఉన్నప్పటికీ, పెద్ద పెద్ద పోస్టర్లు, భారీ కటౌట్లతో థియేటర్లను నింపేస్తున్నారు అభిమానులు. మరోవైపు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. టికెట్ బుకింగ్ వెబ్ సైట్ లో ఎక్కడా తొలిరోజు సినిమాకు టికెట్లు దొరకడం లేదు.
Sahoo
Sensor
Prabhas

More Telugu News