ఈ స్టార్ డమ్ నేను ఎంతమాత్రం ఊహించలేదు: హీరో ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ స్టార్ డమ్ నేను ఎంతమాత్రం ఊహించలేదు: హీరో ప్రభాస్

  • హీరోగా గుర్తింపు వస్తే చాలనుకున్నాను 
  • 'వర్షం' హిట్ ఆనందాన్ని కలిగించింది 
  • 'ఛత్రపతి' హిట్ నమ్మకాన్ని కలిగించిందన్న ప్రభాస్    
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'సాహో' ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ ను గురించి ప్రస్తావిస్తూ .. "చిత్రపరిశ్రమలోకి నేను అడుగుపెట్టిన తరువాత 'ఈశ్వర్' సినిమా చేస్తూ, హీరోగా గుర్తింపు వస్తే చాలని అనుకున్నాను.

'వర్షం' చిత్రం అనూహ్యమైన విజయం సాధించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. రాజమౌళిగారు తెరకెక్కించిన 'ఛత్రపతి' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత, నాపై నాకు నమ్మకం కలిగింది. నేను సక్రమమైన మార్గంలోనే వెళుతున్నాను .. కథల ఎంపిక విషయంలోను నా నిర్ణయం చాలా వరకూ సరైనదిగానే ఉంటోంది అనిపించింది. ఒక హీరోగా సాధారణమైన గుర్తింపును కోరుకున్న నేను, ఈ స్థాయిలో స్టార్ డమ్ వస్తుందని ఎంతమాత్రం ఊహించలేదు .. ఏనాడూ కలగనలేదు" అని చెప్పుకొచ్చాడు.
Prabhas

More Telugu News