అనుష్కను ప్రేమించి వుంటే ఆ విషయాన్ని దాచేవాడిని కాదు: హీరో ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్కను ప్రేమించి వుంటే ఆ విషయాన్ని దాచేవాడిని కాదు: హీరో ప్రభాస్

  • అనుష్కతో ప్రేమ అనేది పుకారే
  • మేము ఎక్కడా ఎవరికీ కలిసి కనిపించింది లేదు 
  • నా వ్యక్తిగత విషయాలను దాచేవాడిని కాదు
'బాహుబలి' సినిమా నుంచి ప్రభాస్ - అనుష్కలు ప్రేమలో పడ్డారనే వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. అలాంటిదేమీ లేదనీ, తామిద్దరం మంచి స్నేహితులమని వాళ్లు ఎంతగా చెప్పినా ఈ పుకార్లు ఆగడం లేదు. తాజాగా ప్రభాస్ కి 'సాహో' ప్రమోషన్స్ లోను, అనుష్కతో ప్రేమ వ్యవహారం గురించిన ప్రశ్నే ఎదురైంది.

అందుకు ప్రభాస్ స్పందిస్తూ .." నిజంగా నేను అనుష్క ప్రేమించుకుని వుంటే, ఇంతకాలంగా ఇంతమంది కళ్లుగప్పి తిరగడం సాధ్యం కాదు. ఎక్కడో ఒక చోట .. ఏదో ఒక సందర్భంలో దొరికిపోయి వుండే వాళ్లం. అలా జరగలేదు అంటే, మా మధ్య అలాంటిదేమీ లేదని అర్థం. ఇంత చిన్న విషయాన్ని ఎవరూ ఎందుకు ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదు. నిజంగా నేను అనుష్కను ప్రేమించి వుంటే, ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా దాచేవాడిని కాదు .. అంత అవసరం నాకు లేదు. నా వ్యక్తిగత విషయాలను దాచాలని నేను ఎప్పుడూ అనుకోను" అని చెప్పుకొచ్చాడు.
Prabhas
Anushka

More Telugu News