రవీనా టాండన్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవీనా టాండన్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • సాహో చిత్రం ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటున్న ప్రభాస్
  • నాచ్ బలియే-9 డ్యాన్స్ రియాల్టీ షోకు హాజరైన ప్రభాస్
  • జడ్జ్ రవీనా టాండన్ తో స్టెప్పులు
తెలుగులోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులకు బాగా దగ్గరైన ఉత్తరాది భామ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రవీనా చీరకొంగును నోటితో పట్టుకుని ప్రభాస్ చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచ్ బలియే-9 అనే డ్యాన్స్ షోలో తన సాహో చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు వెళ్లిన ప్రభాస్ తన అభిమాన నటి, ఆ రియాల్టీ షో జడ్జ్ రవీనాతో స్టెప్పులేశాడు.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, రవీనా తన మాజీ గాళ్ ఫ్రెండ్ అంటూ ఆశ్చర్యపోయేలా కామెంట్ చేశారు. చిన్నవయసులో రవీనా చిత్రాలు చూసి ఆమె అంటే క్రష్ ఏర్పడిందని, అందుకే మాజీ గాళ్ ఫ్రెండ్ అన్నానని తెలిపారు. వాస్తవానికి తనకు ఎవరూ గాళ్ ఫ్రెండ్స్ లేరని మరోసారి స్పష్టం చేశాడు. ఇక, రవీనా భర్త అనిల్ థడాని తమకు ఎంతో సహకరించారని ప్రభాస్ తెలిపారు. సాహో చిత్రాన్ని బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది అనిల్ థడానీయే.
Prabhas
Ravina Tandon

More Telugu News