గోడ దూకి వెళ్లి చిదంబరాన్ని అరెస్ట్ చేయడం దేశానికే సిగ్గుచేటు: స్టాలిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోడ దూకి వెళ్లి చిదంబరాన్ని అరెస్ట్ చేయడం దేశానికే సిగ్గుచేటు: స్టాలిన్

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్ట్
  • చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని స్టాలిన్ ప్రకటన
  • చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా అరెస్ట్ చేశారంటూ అసంతృప్తి
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేయడంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. సీబీఐ అధికారులు గోడ దూకి చిదంబరం నివాసంలోకి వెళ్లడాన్ని తాను కూడా చూశానని, ఇలా వ్యవహరించడం దేశానికే సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం విజ్ఞప్తి చేసినా ఆయనను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే కోర్టుకు తరలించారు.
MK Stalin
Chidambaram
INX Media
CBI

More Telugu News