మంత్రులు బొత్స, అవంతి తలా ఓ రకంగా మాట్లాడుతున్నారు!: బీజేపీ నేత సుజనా చౌదరి

  • రాజధాని అమరావతిపై బొత్స వ్యాఖ్యలపై స్పందన
  • వీళ్లిద్దరి అభిప్రాయాలు ప్రభుత్వానివా? వ్యక్తిగతమా?
  • రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారు
రాజధాని అమరావతి తరలింపు విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రస్తావించారు. ఢిల్లీలో మీడియాతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై బొత్స, మంత్రి అవంతి శ్రీనివాస్ తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వీళ్లిద్దరి అభిప్రాయాలు ప్రభుత్వానివా? వారి వ్యక్తిగతమా? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి సుజనా చౌదరి ప్రస్తావించారు. రివర్స్ టెండరింగ్ విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని  ప్రశ్నించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Amaravathi
Bjp
Sujana Chowdary

More Telugu News