ట్రంప్ నోట మళ్లీ అదే మాట.. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు
- కశ్మీర్ ప్రాంతం చాలా సంక్లిష్టమైనది
- నేను మధ్యవర్తిత్వం వహిస్తే.. వీలైనంతగా సమస్యను పరిష్కరిస్తా
- భారత్-పాక్ ల మధ్య ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి
'కశ్మీర్ ప్రాంతం చాలా సంక్లిష్టమైనది. మీకు హిందువులు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు. అయితే రెండు వర్గాలు సంయమనంతో ఉన్నాయని నేను చెప్పలేను. రెండు దేశాలు చాలా కాలంగా కలసికట్టుగా ముందుకు సాగడం లేదనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. నేను మధ్యవర్తిత్వం వహిస్తే... వీలైనంతగా సమస్యను పరిష్కరిస్తా.' అని ట్రంప్ అన్నారు.
పరిస్థితిని తాము మెరుగుపరచగలమని తాను భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. అయితే, ఇరు దేశాల మధ్య ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని... ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇరు దేశాల్లో మతం అనేది చాలా క్లిష్టమైన సమస్య అని చెప్పారు. మతం విషయంలో చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.