తెలుగుదేశం నేతల బుర్రల్లో ఇస్మార్ట్ చిప్పులు పెట్టండి!: వైసీపీ నేత పీవీపీ సెటైర్లు

  • చంద్రబాబు దేన్ని స్థాపించారు?
  • పాల ఫ్యాక్టరీయా? పప్పుల ఫ్యాక్టరీయా?
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో కావాలనే కృత్రిమ వరదలను ప్రభుత్వం సృష్టించిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు స్థాపించింది పాల ఫ్యాక్టరీనా? లేక పప్పుల ఫ్యాక్టరీనా? అని పీవీపీ ప్రశ్నించారు.

ప్రపంచంలోనే శ్రేష్ఠమైన పప్పులను చంద్రబాబు తయారుచేసి వదులుతున్నారని టీడీపీ నేతలను పరోక్షంగా ప్రస్తావించారు. అసలు ప్రభుత్వం కృత్రిమ వరదలను సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతల బుర్రల్లో ఇప్పటికైనా ఇస్మార్ట్ చిప్పులు పెట్టాలని పీవీపీ సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
amaravati
Chandrababu
YSRCP
pvp
Twitter

More Telugu News