ఫిక్సింగ్ ఆరోపణలతో వణికిపోతున్న మిగిలిన జట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫిక్సింగ్ ఆరోపణలతో వణికిపోతున్న మిగిలిన జట్లు

ఐపీఎల్ లో ఫిక్సింగ్ భూతం జడలు విప్పడంతో టోర్నీపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. గత ఏడాది కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి కానీ అందులో క్రీడాకారుల ప్రమేయం లేకపోవడంతో బుకీలను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు పోలీసులు. ఈసారి మాత్రం పోలీసులు మరింత నిఘా వేసారు. పగలనక రాత్రనక ఫోన్ ట్యాపింగ్ తో బుకీల ఆనుపానులు తెలుసుకున్న పోలీసులు ముగ్గురు ఆటగాళ్ళను, 18 మంది బుకీలను అరెస్టు చేసి ఫిక్సింగ్ గుట్టు విప్పారు.

ఈ ఫిక్సింగ్ భయం తాజాగా మిగిలిన ఆటగాళ్ళకు కూడా పట్టుకుంది. తాజా పరిణామాలతో ఎవరు నిజాయతీపరులో, ఎవరు అవినీతిపరులో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు ఐపీఎల్ జట్ల యజమానులు. ఈ సోదాలు, బుకీల అరెస్టులతో ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందో తెలీక వణికిపోతున్నారు. పోలీసులు విశ్వసనీయ సమాచారం తమ దగ్గరుంచుకోవడంతో ఆ సమాచారాన్ని తమతో పంచుకోవాలని కొంతమంది క్రికెట్ పెద్దలు కోరుతున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి.

క్రికెట్ ను మతంలా భావించే భారత ఉపఖండంలోని జట్లన్నీ ఫిక్సింగ్ భూతం బారిన పడ్డవే. అయితే ఈ ఫిక్సింగ్ ప్రధాన కేంద్రం పాక్ లోనే ఉందన్నది కాదనలేని వాస్తవం. సెలబ్రిటీ హోదాను మహానుభావులకివ్వడం మానేసి, ఎవరి ఉద్యోగం వారు నిర్వర్తించినందుకు ఇస్తుంటే, ఇలాంటి అవినీతి పోకడలను చూడడంలో వింతేమీ లేదని ఎమ్మెల్సీ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News