చిన్నారుల పట్ల మోదీ వాత్సల్యానికి అచ్చెరువొందిన భూటాన్ ప్రధాని
- భూటాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
- రెండ్రోజుల పర్యటన
- పారో ఎయిర్ పోర్టులో మోదీకి ఘనస్వాగతం
నరేంద్ర మోదీ తమ దేశ విద్యార్థుల స్వాగతానికి ప్రతిస్పందించిన వైనం వ్యక్తిగతంగా ఎంతో ముగ్ధుడ్ని చేసిందని పేర్కొన్నారు. "ఎయిర్ పోర్టు నుంచి థింపు నగరం వెళ్లే క్రమంలో టీచర్లు, విద్యార్థులు, గ్రామస్తులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కూడా ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ చర్యల ద్వారా ఆయన ఎంతటి నిరాడంబరమైన వ్యక్తో, ఎంతటి వాస్తవిక మనస్తత్వం ఉన్న వాడో వెల్లడైంది. పిల్లల పట్ల మోదీ ఆపేక్ష స్పష్టంగా కనిపించింది" అంటూ షెరింగ్ పేర్కొన్నారు.