దేశం కోసం చనిపోదామనుకుంటే... ఆ అవకాశం నాకు దక్కలేదు: నరేంద్ర మోదీ భావోద్వేగం
- స్వాతంత్ర్య పోరాటం నాటికి నేను పుట్టలేదు
- ఆ విధంగా ప్రాణత్యాగం చేసే అవకాశాన్ని కోల్పోయాను
- దేశం కోసం జీవించే అవకాశం మాత్రం మిగిలిందన్న మోదీ
అయితే, మరణించే అవకాశం లభించని తనకు దేశం కోసం జీవించే అవకాశం లభించిందన్న తృప్తి మిగిలిందని అన్నారు. నాటి అమర వీరుల త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని, వారిని తలుచుకుంటే మనసంతా గర్వంతో నిండిపోతుందని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం ఎంతో మంది ప్రాణాలను బలిగొందని, వారు చేసిన త్యాగాలపైనే నేటి నవీన భారతావని నిర్మితమైందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి అడుగు జాడల్లో నడవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.