దుమ్ము రేపుతున్న 'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్!

  • ఈ ఉదయం టైటిల్ సాంగ్ టీజర్ విడుదల
  • సైనికుల త్యాగాలను గుర్తు చేస్తూ సాంగ్
  • రెండు గంటల్లో సుమారు నాలుగు లక్షల వ్యూస్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న సరికొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ సాంగ్ ఇప్పుడు నెట్టింట దుమ్ము రేపుతోంది. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి కాపలాగా ఉండే సైన్యానికి నివాళిని అర్పిస్తూ ఇది సాగుతుంది.

జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాలయాల్లో విధులు నిర్వర్తించే సైనికుల చిత్రాలను చూపిస్తూ సాగే సాంగ్ లో చివరిగా, ఇటీవల విడుదలైన ఇంట్రో దృశ్యాలను చూపించారు. "భగ భగ భగ భగమండే... నిప్పుల వర్షమొచ్చినా... జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు... పెళ పెళ పెళ పెళమంటూ మంచుతుఫాను వచ్చినా, వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు... దడ దడ దడ దడమంటూ... తూటాలే దూసుకొచ్చినా... తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు... మారణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురుపంపేవాడు... ఒకడే ఒకడు వాడే సైనికుడు... సరిలేరు నీకెవ్వరూ... నువ్వెళ్లే రహదారికి జోహారు" అంటూ ఈ పాట సాగుతుంది.
Go Back to Shorts
Mahesh Babu
Sarileru Neekevvaru
Tittle Song
Teaser

More Telugu News