మరోసారి విష్ణు విశాల్ తో జోడీ కడుతోన్న అమలా పాల్
- తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'
- తెలుగు రీమేక్ కూడా హిట్
- తమిళ రీమేక్ గా 'జెర్సీ'
నాని - శ్రద్ధా శ్రీనాథ్ జంటగా చేసిన 'జెర్సీ' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. విష్ణు విశాల్ - అమలా పాల్ జంటగా తమిళంలో ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నిర్మాతగా రానా పేరు వినిపిస్తోంది. త్వరలోనే దర్శకుడు ఎవరనే విషయంలో స్పష్టత రానుంది. ఇక హిందీలోనూ 'జెర్సీ' రీమేక్ కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.