కె. విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తే తాను నిర్మాతగా మారతానని కేసీఆర్ ప్రతిపాదన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కె. విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తే తాను నిర్మాతగా మారతానని కేసీఆర్ ప్రతిపాదన

  • సున్నితంగా తిరస్కరించిన కళాతపస్వి
  • కేసీఆర్ తన ఇంటికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కె. విశ్వనాథ్
  • కేసీఆర్ లో ఇన్ని కోణాలున్నాయని ఇప్పుడే తెలిసిందని వ్యాఖ్య
తెలంగాణ సీఎం కేసీఆర్ సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి. ఓ చిత్రంలోని పాట నచ్చడంతో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన కె. విశ్వనాథ్ ను కలిసి తన ఆలోచనలను ఆ మహా దర్శకుడితో పంచుకున్నారు. మీ సినిమాలోని పాట నాకు బాగా నచ్చిందంటూ ముందుగానే కె.విశ్వనాథ్ కు ఫోన్ చేసిన కేసీఆర్, మీ నివాసానికి రావాలనుకుంటున్నాను అని అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలో తన సన్నిహితులతో కలిసి ఫిలింనగర్ లోని కె. విశ్వనాథ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, మళ్లీ దర్శకత్వం వహించాల్సిందిగా కె. విశ్వనాథ్ ను కోరారు. 'మీరు సినిమాలు తీసి పదేళ్లు కావస్తోంది, మళ్లీ మెగాఫోన్ పట్టండి' అంటూ విజ్ఞప్తి చేశారు.

'మీరు దర్శకత్వం వహించండి... నిర్మాణ వ్యవహారాలు నేను చూసుకుంటాను' అంటూ ప్రతిపాదించారు. అయితే, కె. విశ్వనాథ్ మాత్రం తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. తాను మళ్లీ దర్శకత్వం చేపట్టలేనని తెలిపారు. తన ఇంటికి తెలంగాణ సీఎం రావడం పట్ల కె. విశ్వనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ లో ఇన్ని కోణాలున్నాయని తనకు ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఆయన మంచి సాహిత్య అభిలాష ఉన్న వ్యక్తి అని కొనియాడారు.
KCR
K.Viswanath
Tollywood

More Telugu News