'గ్యాంగ్ లీడర్'తో పోటీపడనున్న 'వాల్మీకి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గ్యాంగ్ లీడర్'తో పోటీపడనున్న 'వాల్మీకి'

  • నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్'
  • వరుణ్ తేజ్ హీరోగా 'వాల్మీకి'
  • ఒకే రోజున రెండు సినిమాల రిలీజ్
నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ 'గ్యాంగ్ లీడర్' సినిమాను రూపొందించాడు. కార్తికేయ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేసిన ఈ సినిమాను ముందుగా ఈ నెల 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, అదే రోజుని 'సాహో' ఫిక్స్ చేసుకోవడంతో, 'గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ 13కి వెళ్లింది.

ఇక వరుణ్ తేజ్ కథానాయకుడిగా చేసిన 'వాల్మీకి'ని సెప్టెంబర్ 13వ తేదీనే విడుదల చేయనున్నారు. సోలో రిలీజ్ గా 'వాల్మీకి'ని బరిలోకి దింపాలని హరీశ్ శంకర్ అనుకుంటే, ఇప్పుడు పోటీగా 'గ్యాంగ్ లీడర్' వచ్చాడు. కంటెంట్ పరంగా చూసుకుంటే ఇటు నాని సినిమా .. అటు వరుణ్ తేజ్ మూవీ పూర్తి భిన్నమైనవి. దర్శకుల ఇమేజ్ .. హీరోల క్రేజ్ పరంగా చూసుకున్నా రెండు సినిమాలు పూర్తి వైవిధ్యమైనవిగానే కనిపిస్తాయి. అయినా ఒకే రోజున విడుదలవుతున్నందు వలన, ఏ సినిమా ఎక్కువ మార్కులు కొట్టేయనుందనేది ఆసక్తికరంగా మారింది. 
Nani
Varun

More Telugu News