సెయిల్ చైర్మన్ పై హత్యాయత్నం... ఆలస్యంగా వెల్లడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెయిల్ చైర్మన్ పై హత్యాయత్నం... ఆలస్యంగా వెల్లడి

  • ఢిల్లీలో దాడి
  • డ్రైవర్ ను గట్టిగా పట్టుకుని, సెయిల్ చైర్మన్ ను ఇనుపరాడ్లతో కొట్టిన యువకులు
  • యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్ అనిల్ కుమార్ చౌదరిపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెల్లడైంది. బుధవారం రాత్రి ఆయన ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా మరో కారు ఢీకొట్టింది. దాంతో, అనిల్ కుమార్, ఆయన డ్రైవర్ తమ కారును ఢీకొట్టిన యువకులను ప్రశ్నించారు. దాంతో, ఆ కారులో ఉన్న నలుగురు యువకులు సెయిల్ చైర్మన్ పై ఇష్టంవచ్చినట్టు దాడి చేశారు. వారిలో ఓ వ్యక్తి డ్రైవర్ ను గట్టిగా పట్టుకోగా, మిగిలినవారు ఇనుపరాడ్లతో అనిల్ కుమార్ ను విచక్షణ రహితంగా కొట్టారు. ఈ దాడిలో ఆయనకు బలమైన దెబ్బలు తగిలాయి.

ఇంతలో అటుగా పెట్రోలింగ్ పోలీసుల వాహనం రావడంతో అనిల్ కుమార్ బతికిపోయారు. పోలీసులు దాడికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకుని సెయిల్ చైర్మన్ ను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇది కుట్ర పూరితంగా జరిగిన దాడి అయ్యుండొచ్చని సెయిల్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దాడిలో కేవలం అనిల్ కుమార్ పైనే దాడి చేసిన యువకులు, ఆయన డ్రైవర్ ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదని తెలుస్తోంది.
SAIL
New Delhi
Police

More Telugu News