15 రోజుల వ్యవధిలో కన్నుమూసిన ఇద్దరు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రులు
- ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మ
- ఆరో ముఖ్యమంత్రిగా షీలా సేవలు
- సుష్మాను ఓటమి పాలు చేసిన ఉల్లిగడ్డ ధరలు
1999 ఎన్నికలకు 40 రోజుల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన సుష్మ ఉల్లిపాయల ధరలు అకస్మాత్తుగా పెరగడంతో ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అప్పట్లో కిలో ఉల్లిపాయలు రూ.50కు పెరిగి సామాన్యులకు పెను భారంగా మారాయి. దీంతో చవక ధరల దుకాణాల ద్వారా వాటిని అందరికీ అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ ఆమె ఓటమిని ఆ ప్రయత్నాలు ఆపలేకపోయాయి.