1 నుంచి 1000 నంబర్లు సరిగ్గా రాస్తే రూ. 50... భారీ మోసానికి తెరలేపిన కిలేడీ!

05-08-2019 Mon 10:10 | Both States
  • హైదరాబాద్, కార్ఖానా కేంద్రంగా మోసం
  • తొలుత డబ్బులిచ్చి, నమ్మించి, ఆపై మోసం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
నిరుద్యోగులే ఆమె టార్గెట్. ఏ ఉపాధీ లేకుండా ఖాళీగా ఉన్నవారిని ఆకర్షించి, వారిని బుట్టలో వేసుకుని తేలికైన పని చెప్పి, మొదట్లో డబ్బులు ఇస్తూ, ఆకట్టుకుని భారీ మొత్తంలో డబ్బు లేపేసిందో కిలేడీ. హైదరాబాద్, మల్కాజిగిరి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, చిలకలగూడకు చెందిన మునుకుల షాలిని (24) బీకాం వరకూ చదివింది. ఆమె తమ్ముడు ఆటోడ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. గడచిన మేలో ఖైరతాబాద్‌ లో ఓ 'వర్క్ ఫ్రమ్ హోమ్' కార్యాలయంలో చేరిన ఆమె, డబ్బులు కట్టించుకుని కాగితాలపై నంబర్లు వేయించుకుని చెల్లింపులు చేసే పద్ధతిని చూసింది.

ఆపై నెల రోజుల తరువాత ఉద్యోగం మానేసి, తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలన్న టార్గెట్ పెట్టుకుని కార్ఖానాలో జూన్ లో ఓ ఆఫీస్ ను ప్రారంభించింది. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని, 'వర్క్ ఫ్రమ్ హోమ్' అంటూ, రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 2,500 కట్టించుకుంది. ఐడీ కార్డు ఇస్తామని ఇంకొంత వసూలు చేసింది. వైట్ పేపర్ పై గళ్లు గీసి, ఒకటి నుంచి వెయ్యి వరకూ అంకెలను తప్పుల్లేకుండా వేయాలని చెప్పి, 90 పేపర్లు సక్రమంగా వేసివ్వాలని చెప్పింది. సరిగ్గా వేసిన ఒక్కో పేపరుకు రూ. 50 చొప్పున షాలినీ చెల్లిస్తుండటంతో, ఎంతో మంది ఆశపడి చేరారు.

తొలుత డబ్బులను సక్రమంగా ఇచ్చిన షాలిని, తరువాత డబ్బులు ఎగ్గొట్టింది. ఇలా దాదాపు 100 మందిని మోసం చేసింది. ఆపై జూలైలో ఆర్కేనగర్‌లో మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, 80 మందిని మోసం చేసింది. తన మోసాలకు సహాయం చేసేందుకు బర్గే బాలరాజ్‌ (32) అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకుంది. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో, మోసం జరుగుతోందని గుర్తించిన కొందరు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, విచారించిన పోలీసులు షాలిని, బాలరాజ్ లను అరెస్ట్ చేశారు. వారి ఆఫీసుల్లోని రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
HyderabadPoliceWork From HomeFruadArrest

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more