Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ హీరోపై ఫిర్యాదు చేసిన హీరోయిన్ అస్మిత తల్లి!

  • అముదవాసన్, అస్మిత జంటగా చిత్రం
  • ప్రమోషన్ కు రాని ఇద్దరూ
  • ఫిర్యాదు చేసే అవకాశం లేదని నిర్మాతల ఆవేదన
తన కుమార్తె అస్మితతో కలిసి ఓ సినిమాలో నటించిన హీరో అముదవాసన్, ఆమెను ప్రేమ పేరిట వేధిస్తున్నాడని అస్మిత తల్లి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే, విలక్షణ దర్శకుడు బాలా శిష్యుడు నందన్‌ సుబ్బరాయన్‌ తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ 'మయూరన్‌' అనే చిత్రాన్ని అముదవానన్‌ హీరోగా, మిస్‌ ఇండియా అస్మిత హీరోయిన్‌ గా తెరకెక్కించారు.

ఈ సినిమా శుక్రవారం నాడు విడుదలకు సిద్ధం కాగా, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు అటు అముదవాసన్, ఇటు అస్మిత హాజరు కావడం లేదు. హీరో వస్తే తన కుమార్తె రాదని అమె తల్లి నిర్మాతలకు చెప్పేసింది. తన కుమార్తె కోటీశ్వరురాలని, అముదవాసన్ ప్రేమ పేరిట వేధిస్తున్నాడని ఆమె ఆరోపణ చేస్తోంది.

ఇదే సమయంలో హీరోయిన్ రాకుంటే నేనెందుకు రావాలని హీరో మొండికేస్తున్నాడని సినిమా దర్శక నిర్మాతలు తెలిపారు. నడిగర్‌సంఘం ఎన్నికలు జరిగినా ఫలితాలు ఇంకా వెల్లడి కాకపోవడంతో సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం కూడా లేకపోయిందని వారు వాపోతున్నారు. కాగా, ఈ సినిమా జ్యోతిక నటించిన 'జాక్‌ పాట్', కృష్ణ హీరోగా నటించిన 'కళుగు 2' వంటి పెద్ద చిత్రాల మధ్య విడుదల కానున్న వేళ, ప్రమోషన్ కు హీరో, హీరోయిన్లు రాకపోవడంపై నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Mayuran
Kollywood
Tamil
Movie
Amudavasan
Asmita

More Telugu News