ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు.. జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించిన కేంద్రం!
- ఢిల్లీలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్
- హాజరైన వేర్వేరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
- ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జర్లపై పన్ను తగ్గింపు
ఈ రేట్లు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకుంటే వాటిపై కూడా జీఎస్టీని మినహాయించాలని ఈ భేటీలో తీర్మానించినట్లు చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గత గురువారమే జరగాల్సినప్పటికీ నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాల్సి రావడంతో ఈ భేటీ వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కావడం ఇదే తొలిసారి.