తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకున్న ఏపీ వాసులు.. విజయవంతమైన రేషన్ పోర్టబులిటీ
- రేషన్ తీసుకున్న విశాఖపట్టణం, రాజమండ్రి వాసులు
- ఆగస్టు ఒకటి నుంచి అమలు
- హర్షం వ్యక్తం చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్
ట్రయల్ రన్ విజయవంతం కావడంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ పోర్టబులిటీని గతేడాది ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వలసదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.