అప్పుడు మాత్రం మహేంద్రగారిపై నాకు కోపం వచ్చేసింది: 'దొరసాని' హీరోయిన్ శివాత్మిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడు మాత్రం మహేంద్రగారిపై నాకు కోపం వచ్చేసింది: 'దొరసాని' హీరోయిన్ శివాత్మిక

  • కోదాడలో 25 రోజులు వున్నాను 
  • అమ్మానాన్నలు 'కల్కి' షూటింగుతో బిజీ
  • హైదరాబాద్ వెళ్లొద్దామంటే కుదర్లేదు   
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన 'దొరసాని' సినిమా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో 'దొరసాని' పాత్రను శివాత్మిక పోషించింది. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమా షూటింగు కోసం నేను కోదాడలో 25 రోజులు వున్నాను. 'కల్కి' సినిమా షూటింగు కారణంగా అమ్మానాన్నలు .. అక్కయ్య హైదరాబాదులో వున్నారు.

22 రోజుల పాటు వరుసగా షూటింగు చేస్తూనే వున్నాము. మరుసటి రోజు నన్ను వదిలేయండి .. నేను అమ్మానాన్నల దగ్గరికి వెళ్లేసి వస్తాను అంటే దర్శకుడు మహేంద్ర ఒప్పుకోలేదు. మరుసటి రోజు ఒకే ఒక్క సీన్ చేశారు .. త్వరగా అయితే హైదరాబాద్ వెళ్లిపోదామని అనుకున్నాను. కానీ ఆ సీన్ తీయడం పూర్తయ్యేసరికి సాయంత్రం 4 గంటలు అయింది. అప్పుడు మాత్రం నాకు మహేంద్రగారిపై చాలా కోపం వచ్చేసింది" అని చెప్పుకొచ్చింది. 
Anand devarakonda
Shivathmika

More Telugu News